ఆధునిక భారతీయ మహిళలు, అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడి ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేయాలని కవిత కోరారు.
Kavitha : మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆధునిక భారతీయ మహిళలు, అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడి ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేయాలని కవిత కోరారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు భారత్ జాగృతి తరపున కవిత వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం కవిత మాట్లాడుతూ… స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. భారత జాగృతి పోరాటం వల్లే గతంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కవిత అన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని కవిత తెలిపారు.