»Mla Rekhanayak Made Sensational Comments On Cm Kcr
MLA Rekhanayak: కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే రేఖా నాయక్.. రా.. తో మొదలు పెట్టి
ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు.
MLA Rekhanayak: ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన రేఖా నాయక్.. ‘ఏం రా కేసీఆర్.. ఏం మొఖం పెట్టుకుని ఖానాపూర్‌లో ఓట్లు అడుగుతావ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్.. నీ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ గెలుస్తాడని ఎలా చెబుతావ్..? నీ చెంచాలు, గ్లాసులు ఎత్తేవాళ్లకు ఖానాపూర్‌లో ఓట్లు ఎలా వేస్తాం’అని అసలు కేసీఆర్‌కు బుద్ధి ఉందాని ప్రశ్నించారు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఖానాపూర్ టిక్కెట్టును బీఆర్ఎస్ నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను పక్కన పెట్టిన బీఆర్ఎస్.. మంత్రి కేటీఆర్ స్నేహితుడు భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రేఖానాయక్ బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడా ఆమెకు కాంగ్రెస్‌లో టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ వెడ్మ బొజ్జుకు అవకాశం ఇచ్చింది. రేఖానాయక్ సీఎం కేసీఆర్‌ను ‘ఏం రా’ అని సంబోధించడంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ( BRS ) సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె కాంగ్రెస్ తరపున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
వెళ్లిన ప్రతి చోటా బీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. రేఖానాయక్‌కు బదులు కేసీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్‌కు టికెట్ కేటాయించడంతో రేఖానాయక్ కుటుంబంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్ తండాకు చెందిన భూక్య శామ్యూల్ నాయక్, కేస్లీబాయి దంపతుల కుమారుడు భూక్యా జాన్సన్ నాయక్. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆ సమయంలో కేటీఆర్‌తో స్నేహం కుదిరింది. ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీలో పనిచేసి అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఐటీ కన్సల్టెన్సీని స్థాపించారు. కొంతకాలం అక్కడే స్థిరపడ్డారు. అయితే ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జాన్సన్ నాయక్‌లు నిజాం కాలేజీలో చదువుతున్న సమయంలో సహచరులు కావడంతో వారి మధ్య స్నేహం కొనసాగుతోంది.