»Minister Ktr Inaugurated The Liquid Waste Treatment Plant
Purification plant : లిక్విడ్ వేస్ట్ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్‌యార్డులో వ్యర్థ జలాల ట్రీట్మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. సంవత్సర కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మలారం చెరువు శుద్ధి పూర్తయింది.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ (Jawaharnagar) డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ది ప్లాంట్ (Purification plant) ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. 250 కోట్లతో రాంకీ సంస్థ(Ranky Company) రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించింది. జవహర్‌నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ(GHMC) మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి (Water purification) చేసింది. పేరుకుపోయిన మురికిని శుద్ధి చేసే పనులు కొనసాగుతున్నవి. త్వరలోనే మల్కారం చెరువు జలాలు శుద్ధి కానున్నాయి. పనులు పూర్తయితే జవహర్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలతోపాటు, కలుషిత జలాల సమస్య కూడా పూర్తిగా అరికట్టబడుతుంది.జీహెచ్ఎంసీ సమీపంలోని మల్కారం చెరువు(Malkaram pond) శుద్ధి పనులను మూడు దశలుగా విభజించింది. మొదటి దశలో దాదాపు 5.7 ఎకరాల్లో శుద్ధి చేశారు. వారసత్వ వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 2017లో తాత్కాలిక చర్యగా రోజుకు 2000 కిలోలీటర్ల మొబైల్ RO వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత సామర్థ్యాన్ని 4000 కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు మల్కారం చెరువులో నీటి శుద్ధి కూడా చేపట్టారు.
Minister @KTRBRS inaugurated 2000 KLD Legacy Leachate Treatment Plant at Jawaharnagar Dump Yard, marking an important milestone in tackling water contamination & pollution.
This plant and a series of other steps reflect a significant investment in environmental sustainability. pic.twitter.com/rDWrBW2mia