MIM: 9 చోట్ల పోటీ.. ఆరుగురి అభ్యర్థుల పేర్లు ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 9 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
MIM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కదనరంగంలో మజ్లిస్ కూడా దిగింది. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఎంఐఎం (MIM) వంతు వచ్చింది. రాష్ట్రంలో 9 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) ప్రకటించారు. గత ఎన్నికల్లో 7 చోట్ల మాత్రమే బరిలోకి దిగగా.. ఇప్పుడు మరో రెండు చోట్ల కూడా పోటీకి దింపుతామని తెలిపారు.
9 మందిలో ఆరుగురు అభ్యర్థులను అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మిగతా ముగ్గురిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. చంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ బరిలోకి దిగుతారు. ఇతను అసద్ సోదరుడు అనే సంగతి తెలిసిందే. సభలో మజ్లిస్ పక్ష నేత కూడా. నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్ పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ పోటీ చేస్తారని వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల కోసం ఎంఐఎం అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల
బహదూర్ పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అసదుద్దీన్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. అంతకుముందు ఓ వీడియోలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో గల తన ఇంటికి ఎవరినీ పంపించాలో చెప్పమంటావా రాహుల్ అని అడిగారు.
రాహుల్ గాంధీ .. కర్ణాటక ఎన్నికల ముందు నువ్వు నా ఇంటికి ఎవరిని పంపావో పేరు చెప్పమంటావా – అసదుద్దీన్ ఓవైసీ pic.twitter.com/DYinvXHsNU