RHS Flyover : ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు : మంత్రి కేటీఆర్
తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikantachari)పేరును ఎల్బీనగర్ చౌరస్తా కు నామకరణం చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్( RHS Flyover )ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikantachari)పేరును ఎల్బీనగర్ చౌరస్తా కు నామకరణం చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్( RHS Flyover )ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగరంలో ప్రజలు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్ చెప్పారు.
ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయి.. బైరామల్‌గూడలో (Byramalguda)సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. గడ్డి అన్నారం (Gaḍḍi annaram) మార్కెట్లో వెయ్యి పడకల టిమ్స్( TIMS )ను ఏర్పాటు చేస్తున్నామని. రాబోయే సంవత్సరన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. జీవో నంబర్ 118 కింద దశబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి (MLA Sudhir Reddy) చొరవతో పరిష్కరించుకున్నామన్నారు. ఈ నెలఖారు వరకు పట్టాలు అందించి, ఆ బాధ నుంచి విముక్తి చేస్తాం. మిగిలిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రోను భవిష్యత్ లో మెట్రోను హయత్‌నగర్ (Hayatnagar) వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.