»Komatireddy Brs Will Not Get A Single Seat In The Lok Sabha Elections
Komatireddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు.
Komatireddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఇంకో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. తమను టచ్ చేస్తే బీఆర్ఎస్ను పునాదులతో సహా తీసేస్తామని హెచ్చరించారు.
మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, తమ పార్టీ 12-13 సీట్లు గెలుస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లు కూడా త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించి స్వాగతం పలుకుదామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.