»Kcr Has No Right To Talk About Party Defections Revanth Reddy
Revanth Reddy: పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్‌కు మాట్లాడే అర్హత లేదు
ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూశాము. ఓటింగ్ పరిస్థితి 16 శాతానికి తగ్గింది. బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టే 8 సీట్లు తెచ్చుకుందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. ఈ విధానానికి తెరలేపిందే కేసీఆర్ అని అన్నారు. గతంలో ఆయన చేసిన పనులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఈ ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేశారు. వాళ్లకు తోడుగా బీజీపీ నిలిచింది.
ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూశాము. ఓటింగ్ పరిస్థితి 16 శాతానికి తగ్గింది. బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టే 8 సీట్లు తెచ్చుకుందని అన్నారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉండే మెదక్‌లో మూడో స్థానంలో వచ్చింది, అలాగే సిరిసిల్లా, సిద్దిపేట్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఎంతో చూశాము అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంశాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. ఆయన సేవలను పార్టీకి ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు.