»Kavitha Will Be Arrest In Soonkomatireddy Rajagopal Reddy
kavitha will arrest:కవిత అరెస్ట్ ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
kavitha will be arrest in soon:komatireddy rajagopal reddy
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు వరసగా కామెంట్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) అనగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ (kavitha arrest) అవడం ఖాయం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక (munugodu by poll) సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలను (mla) కొనుగోలు చేస్తోందని సీఎం కేసీఆర్ (cm kcr) తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. దానిని ఎవరూ విశ్వసించలేదన్నారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేకే సీఎం కేసీఆర్ (cm kcr), టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వెంకటేశ్వ స్వామి సాక్షిగా చెబుతున్నా తాను ఎవరికీ అమ్ముడు పోలేదని చెప్పారు. తనను కొనే శక్తి పుట్టలేదు.. పుట్టబోదన్నారు. తాను ఎక్కడైనా అవినీతి (corruption) చేస్తే నిరూపించాలని సవాల్ చేశారు. బీజేపీ పాలన వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తెలిపారు. బీఆర్ఎస్ (brs) పార్టీని బొంద పెట్టేంత వరకు తాను నిద్రపోనని వివరించారు.
ఎన్నికల ఖర్చు కోసం ఆద్ ఆద్మీ పార్టీకి (aap) కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు (150 crores) ఇచ్చారని అంతకముందు వివేక్ (vivek) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా లిక్కర్ వ్యవహారం .. ఢిల్లీ, పంజాబ్లో చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. ఆ లిస్ట్ లో తొలుత మనీశ్ సిసోడియా (sisodia) పేరు లేదు. తర్వాత ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ ఉన్నారు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అని బీజేపీ నేతలు అంటున్నారు.