Iftar Dawat : నేడు ఎల్బీస్టేడియంలో తెలంగాణ సర్కార్ ఇఫ్తార్ విందు
ఈ రోజు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(Iftar Dawat) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఘనంగా ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.
Iftar Dawat : ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సర్కార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో ఘనంగా ముస్లిములకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. రంజన్‌కు రెండ్రోజుల ముందు మాత్రమే ఇచ్చేది. అయితే ఈసారి పది రోజుల ముందుగానే ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇఫ్తార్ వేడుకలకు తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో.. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తారు. దానిలోభాగంగా.. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్(Gift pack)లు పంపిణీ చేయనున్నారు. ‘ఇఫ్తార్ విందు'(Iftar Dawat) సందర్భంగా ఎల్బి స్టేడియం చుట్టుపక్కల సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. ఈ కార్యక్రమం సమయంలో, కింది ప్రదేశాలలో ట్రాఫిక్(Traffic) నిలిపివేయబడుతుంది లేదా మళ్లించడం జరుగుతుంది. చాపెల్ రోడ్, నాంపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్, బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లడానికి ఉద్దేశించిన ట్రాఫిక్ అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ప్రెస్ క్లబ్(Press Club)/బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లడానికి అనుమతించరు. ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు.