»I Will See To It If The Center Blocks Tribal Reservations Bandi Sanjay
Bandi Sanjay : గిరిజన రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా : బండి సంజయ్
గిరిజన (Tribal) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై టీ బీజేపీ ఛీప్ బండి సంజయ్ (Bandi Sanjay)మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అడ్డుకుంటే నేను చూసుకుంటా అని సంచలన కామెంట్స్ చేశారు. గిరిజన బంధు (tribal kin)ఏమైందని ఆయన ప్రశ్నించారు.
గిరిజన (Tribal) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై టీ బీజేపీ ఛీప్ బండి సంజయ్ (Bandi Sanjay)మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అడ్డుకుంటే నేను చూసుకుంటా అని సంచలన కామెంట్స్ చేశారు. గిరిజన బంధు (tribal kin)ఏమైందని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఏపీ (AP) లో గిరిజన కార్పోరేషన్ ఏర్పాటు చేసి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. లిపి లేని సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సేవాలాల్( Sewalal) అని కొనియాడారు. ద్రౌపది ముర్ముని (Draupadi Murmu) రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోదీ నిలబెట్టారని ఆయన గుర్తుచేశారు.
గిరిజన ద్రోహి కేసీఆర్ అని.. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ (Banjara Hills) లో సేవాలాల్ గుడిని అభివృద్ధి చేస్తామన్నారు. కొండగట్టు, వేములవాడకు ఇస్తానని చెప్పిన నిధులు ఎక్కడ? అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంపై సీఎం కేసీఆర్ (CM KCR) కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు (Koṇḍagaṭṭu) ప్రమాద బాధితులకు కనీస సహాయం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ కుట్రను కోమటి రెడ్డి (Komati Reddy) బయట పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల( Election) తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
రెండు పార్టీ లు ఒక్కటే… డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అధికారం పంచుకోవాలని అనుకుటుంటున్న కాంగ్రెస్ పార్టీ (Congress) కి ఎందుకు ఓటు వేయాలి? అని మండిపడ్డారు. BRS తో పొత్తు అంటే సస్పెండ్ చేస్తా? అని రాహుల్ (Rahul) గతంలో అన్నాడు.. మరి కోమటి రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీ లు ఒకటే నని స్పష్టం అవుతుందని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ఫీల్డ్ లో లేదన్నారు. అధికారంలోకి రాబోమని కాంగ్రెస్ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ను ప్రజలు గుర్తించడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ఎక్కడెళ్లిపోయిందని..పాదయాత్ర (Pādayātra)ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress పై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.