హైదరాబాద్ మలక్పేట(Malakpet)లో లభ్యమైన మొండెం లేని తల లభ్యమైన కేసును పోలీసులు చేధించారు.మొండంలోని తలను ఓ నర్సుదిగా పోలీసులు (Police) గుర్తించారు. గత వారం రోజుల కిందట మూసీ పరీవాహక ప్రాంతమైన తీగలగూడ వద్ద పాస్టిక్ కవర్లో తల కనిపించింది.దీనిపై కేసు నమోదు చేశారు. మృతురాలు ఎర్ర అనురాధ(Erra anuradha)గా గుర్తించారు. హంతకుడిని సైతం అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని(dead body) ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచిపెట్టగా తలను మాత్రం మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. మృతురాలి మొండెంను సోదరి, బావ గుర్తించడంతో ఆ తల నర్సు(nurse)గా పని చేస్తున్న అనురాధదే అని ధృవీకరించారు. మృతురాలు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించేదని ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణం అని పోలీసులు (Police) అనుమానిస్తున్నారు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించి.. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు మృతురాలిని గుర్తించడంతో హత్య కేసును ఛేదించారు.