మాజీ మంత్రి టిడిపి (TDP) నేత భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయ్యింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)పై దాడి కేసులో అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రాముడిని ఈ నెల 17వ తేదిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. తాజాగా భూమా అఖిలప్రియ (Akehila priya) బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన కర్నూల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 16న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్మి నారా లోకేష్ (lokesh) యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో భూమా అఖిలప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. తన చున్నీ లాగడంతో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసినట్టుగా అఖిలప్రియ చెబుతున్నారు. అఖిలప్రియ వర్గీయుల దాడిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. ఇంటికెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ కు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో బెయిల్ కోసం కర్నూల్ కోర్టు(Kurnool court) ను ఆశ్రయించారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.