హైదరాబాద్ కోఠిలో ఉన్న ప్రముఖ గోకుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ (75) గురువారం తుది శ్వాస విడిచారు. వయో సంబంధ సమస్యల కారణంగా ఆయన మృతి చెందారని దుఃఖంలో ఉన్న ఆయన కుమారుడు పేర్కొన్నారు. దాస్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన మరణించినట్లు వెల్లడించారు.