గంగవ్వ… ఈ పేరు తెలియని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో విలేజ్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే ఆమె బిగ్ బాస్ కి కూడా వెళ్లింది. అయితే.. తాజాగా ఆమె మంత్రి కేటీఆర్ ని కలిసింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారడం గమనార్హం.
ఆదివారం కరీంనగర్ కళోత్సవాల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో.. గంగవ్వ కేటీఆర్ ని కలిసింది. ఈ సందర్భంగా ఆమె.. కేటీఆర్ హీరో మహేష్ బాబులా ఉన్నాడని చెప్పిందట. దానికి కేటీఆర్ రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
‘గంగవ్వని సోషల్ మీడియాలో చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు. ఆమె మంచిది కాబట్టి నన్ను మహేష్ బాబుతో పోల్చింది. కానీ ఈ మాట మహేష్ బాబు వింటే ఫీల్ అవుతాడు. గంగమ్మా నీ కళ్లు చూపెట్టుకోవాలి జల్దీ.. ఇప్పుడే గంగవ్వకి మాట ఇచ్చాను.. మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని.. ఆ షోకి తప్పకుండా వెళ్తా.. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తా. అలాగే గంగమ్మ దగ్గర నాలుగు విషయాలు నేర్చుకుంటా’ అని అన్నారు కేటీఆర్.