నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్‌లో ఉన్న కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కారు లో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు వ్యాపించినట్లు మంటలు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. జీహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది. నిన్న సికింద్రాబాద్ లోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.