RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్‌రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.