MHBD: ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని 15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన కేసముద్రం మండలం కాళ్లపూజల పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు రైతులు నష్టపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.