SRD: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎంపి, పిఎంపిలు ఎమ్మెల్యే జిఎంఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.