SDPT: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. MPTC, ZPTC లకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.