BDK: ఆయిల్ ఫామ్ గెలల ధరలు పెరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టన్నుకు రూ.281 పెరుగుదలతో పాత ధర రూ.19,400 నుంచి కొత్త ధర రూ.19,681గా నమోదైంది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో పామాయిల్ ఉత్పత్తుల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఆయిల్ఫామ్ ధరలు పెరగడం దీనికి కారణంగా తెలుస్తోంది.