NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వాహకులు సూర్య ప్రకాష్ రావు తెలిపారు. 12న శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 13న ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, 14న సోమవారం బండ్ల ఊరేగింపు, 15న మంగళవారం ఉత్సవ మూర్తుల ఊరేగింపు, అమృత స్నానాలు నిర్వహించనున్నారు.