KNR: డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, జిల్లా పూర్వ అధ్యక్షుడు పలకల ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ పదవీ విరమణ అభినందన సభను స్థానిక సిటీ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. ఈ సభలో వివిధ రంగాల ప్రముఖులు, కవులు, జేఏసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొంటారు.