MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6,11,12 వార్డులలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్ ఛైర్మెన్ జక్కుల శ్వేత శనివారం పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించాలని సిబ్బందికి సూచించారు. సర్వేకు వచ్చిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారు.