MDK: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టులో వరద కొనసాగుతోంది. ఈ మేరకు 632 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మండలంలో నిన్న భారీ వర్షం కురవడంతో జిల్లాలోని అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493.25 ఫీట్ల వద్ద నిల్వ ఉంది. అలుగు ద్వారా 532 క్యూసెక్కులు పారుతున్నాయి.