»Fadnavis Execute Dalitha Bandhu In Maharashtra Kcr Demanded
CM Kcr:కేసీఆర్ నాందేడ్ వస్తేనే రూ.6 వేలు ఇచ్చారు:గులాబీ దళపతి నిప్పులు
CM Kcr:తెలంగాణ (telangana) మోడల్‌గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
Fadnavis execute dalitha bandhu in maharashtra kcr demanded
CM Kcr:తెలంగాణ (telangana) మోడల్‌గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr) అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర (maharashtra) నాందేడ్ (nanded) జిల్లా లోహాలో (loha) జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో (maharashtra) రిజిస్టర్ చేయిస్తామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. జల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలన్నారు. సమస్యలపై రాజీ లేకుండా పోరాడతామని చెప్పారు. సభ నేఫథ్యంలో కంధార్ (kandar), లోహా (loha) పట్టణాలు గులాబీమయం అయ్యాయి. అబ్ కీ బార్ కాసన్ సర్కార్ అనే నినాదాలతో సభ ప్రాంగణం మారుమోగిపోయింది.
ఫసల్ బీమో యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా అని కేసీఆర్ (kcr) అడిగారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చని తెలిపారు.
చదవండి:Puvvada ajay తనను ఓడించేందుకు ట్రై చేశారు..? ఈ సారి ఖమ్మంలో అలా ఉండదు: పువ్వాడ
కాంగ్రెస్, బీజేపీ పాలనతో మన బతుకులు మారాయా..? అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగట్లేదు. మహారాష్ట్రలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో సాగు, తాగు నీరు అన్నిచోట్లకు అందుబాటులో లేదు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా.. ప్రజల బతుకులు మారలేదు. రెండు పార్టీల పాలనలో ఏం తేడా కనిపించలేదు. ఈ రెండు పార్టీలకు రైతులకు ఏం చేయలేదు. అన్ని దేశాల కంటే సాగుకు యోగ్యమైన భూమి మన దేశంలో ఉంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా సాగు నీటికి వనరులు ఉన్నాయి. పాలకులు మాత్రం సాగునీటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయరు.
చదవండి:Puvvada ajay తనను ఓడించేందుకు ట్రై చేశారు..? ఈ సారి ఖమ్మంలో అలా ఉండదు: పువ్వాడ
కేసీఆర్‌కు (kcr) ఇక్కడేం పని అని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం. ఫడ్నవీస్ దళిత బంధు అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. తెలంగాణలో దళితబందు అమలు చేశాం. తెలంగాణ మోడల్లాగా ప్రతి రైతుకు ఎకరాకు 10 వేలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇస్తే.. మహారాష్ట్ర రావడం మానేస్తాను. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు వస్తూనే ఉంటా. ఛత్రపతి శివాజీకి (shivaji) జన్మనిచ్చిన మరాఠా నేలకు ప్రణామం చేశారు.