ADB: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పాల్గొన్నారు. శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.