JN: ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. 34.3 లక్షల విలువ గల చెక్కులను, అలాగే 32 మందికి CMRF చెక్కులు అందచేశారు.