MNCL: గ్రామాల అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమె హాజీపూర్ మండలంలోని నాగారం, ర్యాలీ, చిన్న గోపాలాపూర్, గడ్పూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.