BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాశం భాస్కర్, జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.