KMR: ఈనెల 14న జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. పాత పెండింగ్ కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కారం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందన్నారు.