PDPL: వైన్ షాపులు, బార్ల ఎదుట రోడ్లపై మద్యం సేవించడం శ్రేయస్కరం కాదని, ఇది సామాజిక అశాంతికి దారి తీస్తోందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు . ప్రజల అసౌకర్యం, పారిశుద్ధ్య లోపం దృష్ట్యా ఇలాంటి చర్య లు నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానాలు తప్పవని హెచ్చరించారు.