మేడ్చల్: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి జేజే నగర్, డిఫెన్స్ కాలనీలలో మహిళా పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాలనీల మహిళలకు సైబర్ క్రైమ్స్, ప్రాపర్టీ అఫెన్సెస్ వంటి నేరాల గురించి అవగాహన కల్పించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలుంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.