KMM: జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ఏఓగా బి. చంద్రకళ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ సెక్షన్ సూపరిండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను ఏఓగా పదోన్నతిపై ఖమ్మంకు కేటాయించారు. ఈమేరకు శుక్రవారం విధుల్లో చేరిన ఆమె సీపీ సునీల్ దత్తో పాటు అడిషనల్ డీసీపీలు నరేష్ కుమార్, ప్రసాద్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.