NRPT: మక్తల్ మండలంలోని పారేవుల గ్రామంలో శనివారం పూర్వ విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకు డ్రమ్స్ వితరణ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన సమయంలో ఉపయోగపడే విధంగా డ్రమ్స్, ఇతర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీపాద, రవీందర్ రెడ్డి, మణివర్దన్, వెంకటప్ప, లింగన్న, రాజు, అంజి, తదితరులు ఉన్నారు.