BDK: జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి పొలిమేర రోడ్డు, సిమెంటు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాలను పట్టణాలతో దీటుగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.