MBNR: భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ సంక్షేమ అధికారి మాధవి, పాల్గొన్నారు.