BDK: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 203 ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి RTC తెచ్చింది. ఇందులో అత్యధికంగా కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు నడపనున్నారు. అలాగే ఇల్లందు నుంచి 41, భద్రాచలం 21, మణుగూరు 16, పాల్వంచ నుంచి 15 బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని అధికారులు తెలిపారు.