JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీన పూజా సామాగ్రి, తడకలు, పందిర్లు, క్యూ లైన్, పూల అలంకరణ చేయుటకు సీల్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. స్టిల్ టెండర్లలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దేవస్థాన కార్యాలయంలో రూ.1,000 చెల్లించి షెడ్యూల్ పొందాలని ఆమె కోరారు.