MNCL: మంచిర్యాల పట్టణంలోని భవిత కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య హాజరై ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు సమ్మిళిత విద్య ద్వారా చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.