»Errabelli Dayakar Rao Fires On Tpcc Chief Revanth Reddy
errabelli dayakar rao:కబ్జా చేసినట్టు రుజువు చేస్తే మంత్రి పదవీకి రాజీనామా చేస్తా: ఎర్రబెల్లి
errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు.
errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy), వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (sharmila) వరసగా విమర్శలు చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు జనగామ జిల్లా యశ్వంతాపూర్‌లో స్పందించారు. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (revanth reddy) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఏ రోజు భూకబ్జా కేసు లేదని, ఏ ఒక్కరూ తనపై ఫిర్యాదు కూడా చేయలేదన్నారు.
తమ తాతలకు 1600 ఎకరాల (1600 acres) భూమి ఉండేదని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆ భూమిని అమ్ముకుంటూ రాగా ఇప్పుడు 100 ఎకరాలకు (100 acres) చేరిందని చెప్పారు. అంతేకాని ఎక్కడ కబ్జా చేయలేదని చెప్పారు. మంత్రి దయాకర్‌రావుపై నిరాధారణ ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా రాయపర్తి పీఎస్‌లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఇటు షర్మిల (sharmila) కూడా దయాకర్ రావుపై ఆరోపణలు చేశారు. ఇటీవల షర్మిలను దయాకర్ రావు ఆడది అని కామెంట్ చేశారు. ఆడదానికి (woman) గొంతు ఉండదా అని షర్మిల అడిగారు. అవుతాపూర్ (avurapur)లో YSR విగ్రహాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. YSR విగ్రహం ప్రారంభంలో వచ్చిన మహిళలను లిస్ట్ తీయమని ఎర్రబెల్లి అన్నాడట అని పేర్కొన్నారు . పెన్షన్ అపుతాడట… ప్రభుత్వ పథకాలు ఆపుతాడట అని షర్మిల విరుచుకుపడ్డారు.