»Eleti Maheshwar Reddy Resigns From Congress Soon Joins Bjp
Delhi : కాంగ్రెస్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా…కాసేపట్లో బీజేపీలోకి
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Eleti Maheshwar Reddy) గుడ్‌బై చెప్పారు. ఆయన తన రాజీనామ లేేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) కు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ (BJP) నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Eleti Maheshwar Reddy) గుడ్‌బై చెప్పారు. ఆయన తన రాజీనామ లేేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) కు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ (BJP) నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్నారని భావించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిన్న ఆయనకు షోకాజ్ నోటీసులు(Show Cause Notices) జారీ చేసిన సంగతి తెలిసిందే. గంటలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
తాను చేసిన తప్పేంటో, ఎందుకు నోటీసులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిన్న మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi sanjay) కూడా నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు, కాసేపటి క్రితం బండి సంజయ్, ఈటలతో కలిసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డికి తరుణ్ చుగ్ (Tarun Chugh) శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీ అనంతరం వీరంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లనున్నారు. నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.