కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఈ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. సీఈసీ రాజీవ్‌కుమార్ (Rajeev Kumar) మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది తెలంగాణ(Telangana), రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల్లో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు? నోటిఫికేషన్ (Notification)ఎప్పుడు? కౌంటింగ్ ఎప్పుడు? అనే వివరాలను ప్రకటించనుంది. ఇటీవల 5 రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా, భద్రత, ఎన్నికల (Election) నిర్వహణ అంశాలపై ఆరా తీసింది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుండగా.. తెలంగాణ (Telangana Assembly Elections 2023), రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తాయి.