JGL: కథలాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లారు. CJIపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఆ దాడిని ఖండిస్తూ హైదరాబాదులో చేపడుతున్న నిరసన ర్యాలీకి మండలంలోని నాయకులు బయలుదేరారు. దళితులపై వివక్ష చూపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.