GDWL: పోలీస్ శాఖలో పదోన్నతి అనేది కేవలం హోదా మాత్రమే కాదు, అది బాధ్యతను కూడా రెట్టింపు చేస్తుంది అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నియమితులైన గోరంట్ల నరేష్, సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.