BDK: దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. 47 లక్షల రూపాయలు వ్యయంతో CC రోడ్లు ప్రారంభోత్సవం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని అన్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని వారు తెలిపారు.