SRCL: చందుర్తి మండల కేంద్రంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సోమవారం మండల కేంద్రానికి చెందిన చెందిన మర్రి మల్లేశం (46) , బుర్ర లక్ష్మీదేవి ( 69) అనారోగ్యంతో మృతి చెందగా, ఏనుగుల రాజయ్య ( 70) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతి చెందిన వారి కుటుంబీకులు, బంధువులు కన్నీరు పర్యంతమయ్యారు.