»Ed Official Statement On The Arrest Of Mlc Kavitha
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రకటన
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న కవిత అరెస్ట్ కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది.
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న కవిత అరెస్ట్ కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతించిందని తెలిపారు. కవితను ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉంచుతామని పేర్కొంది. కోర్టు అనుమతితో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.100 కోట్ల ముడుపుల కేసులో కవిత ఇరుక్కున్నారు. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు నిర్వహించగా… ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో సోదాలు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. 5 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా.. రూ. 128 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేసి.. కవితకు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. కాగా, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరూ కవితను కలవనున్నారు. కాగా, కవితను ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. అందులో భాగంగానే ఈరోజు వారిద్దరూ భేటీ కానున్నారు.