NZB: న్యాయవాదుల పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో గురువారం సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పెంచే విధంగా కృషి చేస్తామన్నారు.