Chekoti Praveen : క్యాసినో కింగ్‌ని ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ (Chikoti praveen) ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రవీణ్‌ను విచారించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై అధికారులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో (Chekoti Praveen Kumar)ను ఈడీ ప్రశ్నించింది. వేర్వేరు అంశాలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. థాయ్‌లాండ్ (Thailand) దేశం పటాయాలో ఇటీవల అక్కడి పోలీసులు ఓ హోటల్లో నడుస్తున్న క్యాసినో సెంటర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే గేమింగ్చిప్స్తోపాటు లక్షా అరవై అయిదువేల రూపాయల ఇండియన్కరెన్సీని పటాయా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఓ లాగ్‌బుక్‌ను సీజ్‌చేశారు. దీనిని విశ్లేషించినపుడు అయిదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్జరిగినట్టుగా వెల్లడైంది. నగదు లావాదేవీలన్నీ ఇక్కడ మన దేశంలోనే హవాలా రూపంలో జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌కుమార్, మెదక్డీసీసీబీ ఛైర్మన్చిట్టి దేవేందర్‌రెడ్డి(Devender Reddy), మాధవరెడ్డితోపాటు మొత్తం 83మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు.క్యాసినో కేసులో థాయ్‌లాండ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్యాసినో (Casino) నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, అతని అనుచరులతో పాటు.. క్యాసినో ఆడేందుకు వెళ్లిన వారిని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్‌ను అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
ఈ మేరకు కోన్ బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.రూ.లక్షా 60 వేలు నగదు, 92 చరవాణిలు, ఒక ఐపాడ్‌తో పాటు.. మూడు ల్యాప్ టాప్‌లు, 25 సెట్ల ప్లే కార్డులు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ అనుచరుడు మాధవరెడ్డి(Madhav Reddy)తో పాటు పలువురు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.అనుమతి లేకుండా క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చీకోటి ప్రవీణ్‌పై ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవా(Goa)లో బిగ్ డాడీ, క్యాసినో పలు రకాల పేకాటలు నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్.. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.