హన్మకొండ: ధర్మసాగర్ మండల కేంద్రంలో అనాధ పిల్లలకు ఎన్నారై రూ. పదివేల ఆర్థిక సహాయాన్ని నేడు అందజేశారు. తల్లిదండ్రులు ఇద్దరు కొద్దిరోజుల తేడాతో మృతి చెందడంతో ఇద్దరు బాలురు అనాధలుగా మిగిలిపోయారు. వీరి కుటుంబానికి ఎన్నారై రామిరెడ్డి చేయూతనందించారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు.